గత కొన్ని రోజులుగా సినిమాల్లో తక్కువగా కనిపించిన నితిన్ సినిమా షెడ్యూల్ బిజీగా మారింది. చేతిలో మూడు సినిమాలు ఉండడంతో షూటింగులతోనే కాలం గడుపుతున్నాడు. ఇప్పటికే చెక్, రంగ్ దే వంటి సినిమాల్లో నటించిన ఆయన మరో సినిమా తీయబోతున్నాడు. ఈ సినిమా నితిన్ కు 30వది కావడంతో ఈ మధ్యే ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. మరి ఆ సినిమా విశేషాలేంటో చూద్దాం..

మేర్లపాటి గాంధీ దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ లో బంపర్ హిట్టు కొట్టిన ‘అంధాదున్’ సినిమా రీమేక్ ఇది. ఇందులో నితిన్ సరసన నభా నటేశ్ హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది. మరో ముఖ్యమైన పాత్రలో తమన్న భాటియా కూడా పోషిస్తోంది. ఎస్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మాతలుగా చేస్తున్న ఈ మూవీకి మహతీ స్వర సాగర్ సంగీతాన్ని అందించనున్నారు. సినిమాటోగ్రాఫర్ గా హరి, కే వేదాంత్ పనిచేయనున్నారు.

ఇటీవల చిత్రం యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ లో నితిన్ ఓ ఫియానో వాయిస్తూ ఉన్నాడు. దీనిపై నితిన్ 30, జూన్ 11 అని ఉంది. అంటే నితిన్ 30వ సినిమా అయిన ఇది జూన్ 11న విడుదల చేసేందుకు తేదీని ప్రకటించారు. దీంతో నితిన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియాలో ఇమేజ్ ను షేర్ చేస్తున్నారు.

కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న నితిన్ ఆ తరువాత సినిమాల్లో బిజీగా మారారు. అంతకుముందు భీష్మ సినిమాలో తన ప్రతాపాన్ని చూపిన తరువాత నితిన్ సినిమా రాలేదు. ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలు వరుసగా వస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. కాగా చెక్, రంగ్ దే సినిమాల్లో ప్రమోషన్లు జరగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published.