బాలీవుడ్లో బిగ్గెస్ట్ హీరోలతో సినిమాలు చేసిన పూజా హెగ్డే టాలీవుడ్లోనూ అదే స్టైల్ కొనసాగించింది. అగ్రహీరోల సరసన నటిస్తూ ప్రముఖ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ‘అల వైకుంఠపురం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులందరినీ మెప్పించిన ఈ అమ్మడు ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘రాధే శ్యామ్’లో నటిస్తోంది. తాజాగా పూజా హెగ్డేపై ఓ న్యూస్ వైరల్ అవుతోంది. తాను ఎప్పటి నుంచో అనుకుంటున్న ఓ కోరికను ఆమె తీర్చుకుంటుదట. ఇందుకోసం చాలా కష్టపడిందట. మొత్తానికి అనుకున్నది పూజా హెగ్డే సాధించిందని ఆమె ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇంతకీ పూజ హెగ్డే తీర్చకున్న ఆ కోరిక ఏంటంటే..?

ఇటు టాలీవుడ్..అటు బాలీవుడ్లోని సినిమాలను దక్కించుకుంటూ రెండు చేతులా సంపాదిస్తోంది పూజా హెగ్డే. హైదరాబాద్ టు ముంబై ట్రావెల్ చేస్తూ రెండు ఇండస్ట్రీల్లోని సినిమాలను చేస్తోంది. తీరిక దొరికినప్పుడల్లా తన తల్లిదండ్రుల వద్ద గడిపే పూజా తాజాగా ఓ ఇల్లు కొనుక్కుందట. త్రిబుల్ బెడ్ రూం కలిగిని ఓ అపార్ట్మెంట్ ను భారీ వ్యయంతో కొనుగోలు చేసిందట.

బాలీవుడ్ స్టార్లు ఉండే బాంద్రాలోనే ఈ అమ్మడు సైతం ఇల్లును కొనేసిందట. మంచి బీచ్ వ్యహింగ్తో ఉన్న ఈ అపార్టమెంలో ఖాళీగా ఉన్నప్పుడు గడిపేస్తుందట. అయితే ప్రస్తతం చిన్న చిన్న వర్క్స చేయించుకుంటున్న ఈ భామ అవి పూర్తి కాగానే ఇక్కడికి షిప్ట్ కానుందట. ఆ తరువాత ఆమె ఇందులోనే తన జీవితాన్ని కొనసాగించనుందట.

అయితే ఈ అపార్టమెంట్ వివరాలను మాత్రం పూజా సీక్రెట్ గా ఉంచుతోంది. తాను ఇందులోకి షిప్ట్ అయిన తరువాత చెప్పాలని చూస్తుందట. ప్రస్తుతం పూజా తెలుగులో ‘రాధేశ్యామ్’తో పాటు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’సినిమాలో నటిస్తోంది. అటు బాలీవుడ్ లోనూ సల్మాన్ ఖాన్ పక్కన నటించనుంది. మొత్తానికి పూజా హెగ్డే ప్రస్తుతం మంచి మంచి అవకాశాలతో జోరుగా సంపాదిస్తోంది.