సినిమాల్లో నటుడిగా నిలదొక్కుకోవాలంటే ఎంతో కష్టపడాలి. ఆ విషయం మనకు కొన్ని సినిమాల్లో చూపించారు కూడా. అయితే కొందరు ఒక్క సినిమాతోనే స్టార్ హీరో అయినవారు ఉన్నారు. కానీ మరికొందరికి స్లోగా ఛాన్సెస్ వచ్చినా చివరికి పెద్ద హీరో అయినవారూ ఉన్నారు. రెండో కోవలోకి వస్తారు సత్యదేవ్. సినీ ఇండస్ట్రీలో స్లో పాయిజన్ లా నిదానంగా ఎదుగుతున్నారు. సహాయ నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన హీరోస్థాయికి ఎదిగారు. పూరి జగన్నాథ్ సినిమా ‘జ్యోతిలక్ష్మి’ సినిమాలో ఆయన హీరో అయినా ఇది వుమెన్ ఓరియెంటెడ్ ఫిల్మ్. దీంతో ఆయన గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. కానీ ఓటీటీ సత్యదేవ్ కు కలిసొచ్చింది. వెబ్ సిరీస్ల్లోని అగ్రనటుల్లో సత్యదేవ్ ఒకరిగా నిలిచారు. అయితే తాజాగా ఆయన ఏకంగా మెగాస్థార్ చిరంజీవితో నటించే అవకాశం కొట్టేశాడు.

రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్నారు. కథ బాగుంటే ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేస్తున్నాడు. ఇక ఈ మధ్య మళయాలంలో విజయం సాధించిన సినిమాలు తెలుగులో బాగా రీమేక్ అవుతున్నారు. వాటిలో లూసిఫర్ ను తెలుగులోకి మోహన్ రాజా తీసుకువస్తున్నారు. ఇందులో ప్రధాన హీరో చిరంజీవి అయితే ఆయన పక్కన సత్యదేవ్ నటించనున్నాడు.

గత కొన్ని రోజుల కిందట సత్యదేవ్ చిరంజీవిని కలిసిన ఫొటోలు బయటికి రావడంతో రకరకాల ప్రచారం జరిగింది. సత్యదేవ్ కు మెగాస్టార్ తన సినిమాలో అవకాశం ఇస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే తాజాగా చిరంజీవి ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషీ అవుతున్నారు. మొత్తానికి సత్యదేవ్ లూసిఫర్ లో పృథ్వీ స్థానంలో నటించనున్నారు. దీంతో చిరంజీవికి థ్యాంక్స్ చెప్పేందుకు సత్యదేవ్ ప్రత్యేకంగా కలిశారని తెలుస్తోంది.

లూసిఫర్ లో సత్యదేవ్ పొలిటికల్ లీడర్ లా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి కే బ్లఫ్ మాస్టర్ లాంటి సూపర్ డూపర్ వెబ్ సిరీస్ తో పేరు తెచ్చుకున్న సత్యదేవ్ లూసిఫర్ తో ఏ స్థాయికి వెళ్తాడోనన్న చర్చ జరుగుతోంది. కరోనా కాలంలో చాలా మంది హీరోలకు నష్టాలను తెచ్చిపెడితే.. సత్యదేవ్ కు మాత్రం లాభాల పంట కురిసింది. మరీ ఈ యంగ్ హీరో ఇంకే అవకాశాలు దక్కించుకుంటాడో చూడాలి.