మెగా పవర్ స్టార్ ఇప్పుడు సౌత్ స్థాయిలో బిగ్ హీరో కాబోతున్నాడు. డైనమిక్ డైరెక్టర్ శంకర్ తీయబోయే సినిమాలో రామ్ చరణ్ నటిస్తుండడంతో ఆయన సినిమాపై భారీ అంచనాలు పెరగుతున్నాయి. అయితే శంకర్ డైరెక్షన్లో ఎక్కడా కాంప్రమైజ్ కాడు. ప్రతీదీ పక్కాగా చూసుకుంటాడు. హీరోయిన్ విషయంలోనూ అంతే. రోమాన్స్ తో పాటు యాక్షన్ చేసే హాలీవుడ్ హీరోయిన్లను దించుతాడు. ఇప్పటికే అమీనా జాక్షన్ వంటి బ్రిటన్ బ్యూటీతో సినిమా తీసి భేష్ అనిపించుకున్నాడు. తాజాగా రామ్ చరణ్ కోసం సౌత్ కొరియన్ అమ్మాయిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడట. ఆ వివలాంటే చూద్దాం..

రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’లో నటిస్తూ నిర్మాణ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఇదే సమయంలో రామ్, శంకర్ ల సినిమా ఉంటుందని ప్రచారం అయిన నేపథ్యంలో ఇటీవల శంకర్ ట్విట్టర్లో దానిని నిజం చేశాడు. అటు చిరంజీవి సైతం శంకర్ లాంటి బిగ్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ప్రకటించాడు.

శంకర్ తీసే సినిమా భారీ ఖర్చతో కూడుకొని ఉంటుంది. అంతేస్థాయిలో రిజల్ట్ ఉంటుంది. దీంతో పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు మాత్రమే శంకర్ సినిమాను కోరుకుంటాయి. అయితే ఈ మూవీని మన తెలుగు సినిమా నిర్మాత దిల్ రాజ్ తీయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రామ్ చరణ్ కు జోడిగా హీరోయిన్ ఎవరన్న ప్రశ్న సినీ వర్గాల్లో చర్చ తీవ్రమైంది. ఎందుకంటే శంకర్ సినిమాలో నటించేందుకు ఏ హీరోయిన్ వద్దనదు. ఈ నేపథ్యంలో యంగ్ హీరోతో రోమాన్స్ చేసేదెవరే ప్రశ్న తలెత్తుతున్న సమయంలో ఓ టాక్ వైరల్ అవుతోంది.

సౌత్ కొరియన్ బ్యూటి ‘సుజీ బీ ’రామ్ చరణ్ పక్కన నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు శంకర్ ఆమెతో చర్చలు జరుపుతున్నాడట. ఈ అమ్మడు ఇప్పటికే భారతీయుడు-2లో ప్రముఖ రోల్ చేస్తోంది. దీంతో ఈ సినిమా పాన్ ఇండియా కాకుండా.. పాన్ ఏసిమా మూవీగా కానున్నట్లు చర్చ జరుగుతోంది. అలాగే బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, సౌత్ నటి రష్మికా మందానాలు సైతం శంకర్ సినిమాలో కనిపించనున్నారట.