జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్న తెరపై మాత్రం చాలా ఉత్సాహంగా కనిపిస్తారు సీని నటుటు. ఎన్ని బాధలు ఉన్న దిగమింగుకొని తమ పాత్రలకు న్యాయం చేస్తుంటారు. ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా షూటింగ్‌ స్పాట్‌కు వస్తే మాత్రం అవన్ని మర్చిపోయి తమకు ఇచ్చిన క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్‌ అయిపోతారు. అలాంటి కొద్ది మంది నటుల్లో ఒకరు సురేఖ వాణి. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఆమె తెలుగు ప్రేక్షకులను బాగా సుపరిచితురాలు. చాలా సినిమాల్లో బ్రహ్మానందం భార్యగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో పాటు అందంలో కూడా నేటి హీరోయిన్లకు పోటీగా ఉంటుంది సురేఖ. చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా సరే ఆమె మాత్రం పాపులరే. సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఎప్పుడూ దగ్గరగా ఉంటోంది.

ప్రస్తుతం ఆమెను వేధిస్తున్న బాధ భర్త మరణం. 2019లో అనారోగ్యం కారణంగా సురేఖ వాణి భర్త సురేష్ తేజ మరణించిన విషయం తెలిసిందే. వీరిద్దరిది ప్రేమ వివాహం. సురేష్ నటుడుగా చేశారు. అనేక తెలుగు టీవీ ప్రొగ్రామ్స్ టీవీ షోలకు డైరెక్టర్‌గా పనిచేశారు. మా టాకీస్ హార్ట్ బీట్ మొగుడ్స్ పెళ్లామ్స్ వంటి ప్రోగామ్స్‌కు దరకత్వం వహించారు. సురేఖ వాణి ఆ సమయంలోనే యాంకర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

ఆ సమయంలో బుల్లితెరపై డెరెక్టర్ ఉన్న సూర్య ను వివాహం చేసుకున్నారు. భర్త చనిపోయిన తర్వాత సురేఖకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.సోషల్ మీడియాలో కూతురుతో కలిసి అప్పుడప్పుడు యాక్టివ్‌గా కనిపిస్తున్న లోపల బాధ మాత్రం అలాగే ఉండిపోయింది. సురేఖవాణి బాధను చూసిన ఆమె కూతురు మళ్లీ పెళ్లి చేసుకోమనే ప్రపోజల్ పెట్టిందంట. ఇటీవలే టాలీవుడ్ సింగర్ సునీత రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.