ఎనర్జిటిక్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ వై.వి.యస్.చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాసు సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన రామ్ మొదటి సినిమాతోనే డాన్సులు ఫైట్స్ నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జగడం అంతగా ఆడలేదు. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన రెడీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నాడు.

 

తర్వాత చేసిన కొన్ని సినిమాలు హీరోగా రామ్‌కు ఫ్లాప్‌ను అందించాయి. ఆ తర్వాత కందిరీగ రామ్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ఎందుకంటే ప్రేమంట నేను శైలజా ఉన్నది ఒకటే జిందగీ వంటి క్లాస్ సినిమాలు రామ్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. గతేడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా రామ్‌కు మాస్‌లో మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాలో ఇస్మార్ట్ శంకర్‌గా రామ్ నటనకు మంచి పేరు తీసుకొచ్చింది.

రామ్ తన తాజా చిత్రాన్ని తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమాతో రామ్ తమిళ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేయనున్నారు. ఈ సినిమాని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలోని హీరోయిన్‌ పాత్రపై సినీ వర్గాల్లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా చేయనుందని టాక్ నడుస్తోంది. దర్శకుడు లింగు స్వామి తన సినిమాలో కృతిని అనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.